తీరెను కోరిక తీయతీయగా

telugu sex stories boothu kathalu “ఏంటి దీపూ…బ్లౌజ్ హుక్స్ పెట్టమంటేఅలా …వేళ్లతో చక్కిలిగింతలు పెడతావేం! ఇక్కడున్నన్నినాళ్ళూ కూడా చీరలే కట్టాలని నువ్వు హుకుం జారీ చేశావు కాబట్టి తప్పనిసరై కట్టుకుంటున్నాను. లేకపోతే హాయిగా ఓనైటీ దిగేసుకుంటే సరిపోదును!’’ భర్త చేస్తున్న చిలిపి పనులకి మురిసిపోతూనే అతడిని వారిస్తోంది కోడలు కావ్య.

“ ఇలాంటప్పుడు కాకపోతే తమరు నాచేతికి చిక్కేదెప్పుడని! ముద్దొచ్చినప్పుడే చంకనెక్కమని సామెత ఉందిలే…’’ హుక్స్ పెట్టేనెపంతో దీపక్ ఏచిలిపి పనులు చేశాడో ఏమో చిన్నగా అరిచింది కావ్య ‘కెవ్వు’ మని.

ఏదో అడుగుదామని వాళ్ల గదితలుపు తట్టబోయిన రాధమ్మఅక్కడ ఏంజరిగుంటుందో అంచనా వేసుకుని, ఆపని విరమించుకుని వెనక్కిమళ్లింది. పక్కనే ఉన్న చిన్నకొడుకు గది తలుపు తెరిచే ఉండడం గమనించి చిన్నగా తలుపు నెట్టింది శబ్దం కాకుండా.

అక్కడి దృశ్యాన్ని చూసి మ్రాన్పడిపోయింది ఒక్కసారిగా. చిన్నకోడలు కీర్తన మంచంమీద విలాసంగా కూర్చుని చేతిలో ఏదో మ్యాగజైన్ పట్టుకుని చదువుకుంటూ కూర్చుని ఉంటే చిన్నకొడుకు భువన్ ఆమె పాదాలని ఒళ్ళో పెట్టుకుని ఆకురాతితో మడమలని రాస్తూ ఆమెకు పెడిక్యూర్ చేస్తున్నాడు.

“అబ్బ…ఏంటిరా… అంత గట్టిగా పాముతావేం… ఏపనిలోనూ సున్నితం లేదు…’’ముద్దుగా విసుక్కుంటోంది కీర్తన మొగుడిని.

“ ఏపనిలోనూ అంటే!’’ చేస్తున్న పనినాపకుండానే కొంటెగా అడిగాడు భువన్.

“ఛప్…నోర్ముయ్! అసన్నీ నాచేతే చెప్పించాలనుకుంటావు? నాటీ…’’ చేతిలోని పుస్తకంతో అతడి నెత్తిన చిన్నగా మొట్టింది కీర్తన.

“నువ్వు బుధ్ధిగా కూర్చో అమ్మాయ్! లేకపోతే నీకే నష్టం.చేస్తున్న పనినాపేసి నిన్ను అలాగే మంచంమీదకి నెట్టేయాల్సి ఉంటుంది…’’ సుతిమెత్తని ఆమె పాదాల ని సంరక్షిస్తూనే చెప్పాడు భువన్.

“అవును …తమరంతకి తగుదురని నాకు తెలుసు…’’ మోము కందగా అంది కీర్తన.

తనరాక వారి చిలిపి సల్లాపాలకి ఆటంకం కాకూడదన్న తలంపుతో మౌనంగా వెనక్కి జరిగింది రాధమ్మ తలుపు చప్పుడు కాకుండా సున్నితంగా దగ్గరకు లాగుతూ.

ఆ రెండుగదులకీ ఆపోజిట్ లో ఉన్న ఇంకో పడకగదికేసి నడిచింది అక్కడేం చూడాలో అని ఆలోచిస్తూ. ఆగది తలుపులు ఓరవాకిలిగా తీసి ఉన్నాయి. ‘హమ్మయ్య’ వీళ్లన్నా కాస్త ఖాళీగా దొరికారు అనుకుని లోపలికి అడుగిడిన రాధమ్మ తన అంచనా తప్పినందుకు విచారించింది.

 

అక్కడి దృశ్యం చూసి ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. మంచంమీద కూర్చున్న అల్లుడు అరుణ్ ఒడిలో వెల్లకిలా పడుకుని గారాలు పోతోంది కూతురు అవని. స్థానభ్రంశం చెందిన దుస్తులు, ఒకరినొకరు హత్తుకుపోయినట్లున్న ఆభంగిమ చూసి రాధమ్మ ఒళ్లంతా రక్తం పరుగులు దీసింది.

“ ఏంటిరా అరుణ్ ఇది! పగలు రాత్రి తేడాలేదా? వేళాపాళా లేకుండా ఈ రొమాన్సేమిటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు!’’ మత్తుగా భర్తను వారిస్తూనే అతడి చేష్టలకి పరవశించిపోతోంది అవని.

“ఏమనుకుంటారు! కొత్తదంపతులు సరసంలో మునిగి తేలుతున్నారనుకుంటారు…అయినా జాంపండులా నువ్విలా నోరూరిస్తూ ఉంటే పగలురాత్రి తేడా ఎలా తెలుస్తుంది చెప్పు!’’ తమకంతో ఆమెను అల్లుకుపోతున్నాడు అరుణ్.

“ ఆగరా బాబూ! రాత్రంతా నిద్ర లేకుండా చేశావు…మళ్ళీ ఇప్పుడు అతుక్కుపోవాలని చూస్తున్నావు…ఇలా అయితే ఎలా చెప్పు! ఉండు కనీసం తలుపన్నా గడియపెట్టి వస్తా’’ అంటూ లేవబోతున్న అవనిని అలాగే అదిమిపెడుతూ…ఇప్పుడీ గదిలోకి ఎవరొస్తారు డార్లింగ్…ఒకవేళ పొరబాటున వచ్చినా వాళ్ళే తప్పుకుపోతారు. కమాన్ డియర్…కబురులతో కాలాన్ని కరిగించేయకు…’’మోహంతో రగిలిపోతున్న అరుణ్ అంటున్నాడు గుసగుసలాడుతున్నట్లుగా.

సిగ్గుతో చితికిపోతూ నిశ్శబ్దంగా అవతలకి పోయింది రాధమ్మ. కోడె ఈడు కొత్తజంటలు అసందర్భంగా సాగిస్తున్న ఆ శృంగార చేష్టలు కళ్లబడేసరికి ఆమె ఒళ్లంతా ఏదో వింత తమకంతో జ్వలించిపోయింది. రెండురోజుల్లో జరగబోతున్న ముద్దుకృష్ణ షష్టిపూర్తి కోసమని మూడుజంటలూ ఊరినుంచి వచ్చి రెండురోజులైంది. నిరంతరం ఉద్యోగబాధ్యతలలో నిమగ్నమైఉండే వారు ఆటవిడుపుగా దొరికిన ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగపరుచుకోవాలనుకోవడం రాధమ్మకి ఆనందహేతువైంది.

చనువుగా ఒకరినొకరు సంబోధించుకుంటున్న వారి తీరు, ఏకాంతంలో వారు అనుభవిస్తున్న ఆదగ్గరతనం చూసి ఒకవంక ముచ్చటపడినా మరోపక్క ఏదో కోల్పోయినట్లుగా మనసు బాధతో మూలిగింది.

అలా ఆలోచిస్తూనే మేడదిగి కింద హాల్లోకి వచ్చింది రాధమ్మ. అక్కడ కూర్చుని షష్తిపూర్తినాడు ఏమేంచేయాలో, ఎవరిని పిలవాలో చర్చించుకుంటున్నారు ఆమె అన్నయ్య పాండురంగం, మేనమామ శబరినాధం.

“అసలు షష్టిపూర్తి అంటే ఏమిటి చేస్తారు మామయ్యా? భార్యాభర్తలిద్దరికీ మళ్ళీ పెళ్ళి చేస్తారా? మళ్ళీ, తాళికట్టడం, తలంబ్రాలు పోసుకోవడం లాంటి తతంగాలన్నీ ఉంటాయా?’’ కుతూహలంగా ప్రశ్నించాడు పాండురంగం.

వాళ్ల కుటుంబాలన్నింటికీ పెద్దతలకాయలాంటి శబరినాధం తన బోసినోరు విశాలంగా తెరచి ఒక నవ్వు చిందించాడు చిద్విలాసంగా.

“అవన్నీ, సినిమావాళ్ల పైత్యాల్రా అబ్బాయ్! లేకపోతే ఓసారి పెళ్లైన దంపతులకి మళ్ళీ పెళ్ళి చేయడమేమిటీ… విడ్డూరం కాకపోతేనూ! అలా చేయడం శాస్త్ర విరుధ్ధం కూడానూ!’’ చెప్పాడు శబరినాధం తన బొడ్లో దోపుకున్న చిక్కంలోచి నశ్యండబ్బాతీసి అందులోని నశ్యాన్ని రెండువేళ్లతోటీ తీసి ఓపట్టుపడుతూ.

ఘాటైన ఆనశ్యం వాసనభరించలేక ముక్కుమూసుకుంటూ ‘ముసలాడికి ఈపాడు అలవాటొకటి!’ఈకంపు తట్టుకోలేక ఆమడదూరం పారిపోవాలనే ఉన్నా ఇతగాడు చేప్పే ఉపయుక్తమైన సంగతులు వేరెవరి దగ్గరా లభ్యంకావన్న విషయం గుర్తొచ్చి, తప్పనిసరై రుమాలు తో ముక్కు మూసుకున్నాడు పాండురంగం.

“ ఇంతకీ షష్టి పూర్తి అంటే ఏమిటి చేస్తారో చెప్పావు కాదు మామయ్యా?’’ ముక్కులో పెట్టుకున్న నశ్యంఘాటు అదేపనిగా తుమ్ములు తెప్పిస్తూంటే ‘హాచ్…హాచ్…’ మంటూ తుమ్ముతున్న శబరినాధాన్ని ఉద్దేశ్యించి మళ్ళీ ప్రశ్నించాడు పాండురంగం.

 

“అక్కడికే వస్తున్నానురా అబ్బాయ్! షష్టిపూర్తి నాడు దంపతులిద్దరూ అభ్యంగన స్నానాలాచరించి, నూతన వస్త్రాలు ధరించి, పీటలమీద కూర్చోవాలి. ఆతరువాత వారిద్దరి ఆయురారోగ్యాలు పదికాలాల పాటు పచ్చగా ఉండాలన్న తలంపుతో దంపతులచేత ఆయుష్షు హోమం చేయిస్తారు. అయినవాళ్ళు వారికి కానుకలు ఇచ్చి గౌరవించుకుంటారు. వారుకూడా యధాశక్తి ‘రిటర్న్ గిఫ్ట్స్’ ఇచ్చి అతిధులని సంతోషపెడతారనుకో. అటుపైన విందుభోజనాలు, మిగతా సరదాలన్నీ మామూలే అనుకో.అంతేగాని సినిమాలలో చూపెట్టినట్లుగా’మాతాతకి మళ్ళీపెళ్ళి,మా నాన్నమ్మ పెళ్ళికూతురాయెనే’ అంటూ వెధవ హంగామాలన్నీ చేయడం కాదు. ‘’ నొక్కి వక్కాణించాడు శబరినాధం.

‘శంఖున పోస్తే తీర్ధం ‘అన్నచందాన తమకి పెద్దతలకాయైన ఆతలపండిన వృధ్ధుడు చెప్పిన తరువాత ఇక తిరుగేముంది? అనుకున్న పాండురంగం ఈవిషయం ఇంట్లో సభ్యులతో చర్చించేందుకు ముందుకు ఉరికాడు.

ఈ సంభాషణంతా అక్కడే ఉండి ఏవో చక్కబెడుతున్న రాధమ్మ చెవుల పడనే పడింది. ఏదో… తోడబుట్టినవాడు, తన కడుపున పుట్టిన పిల్లలు కలిసి ముచ్చట పడి ఈవేడుక చేస్తామని పట్టుపట్టారు కాబట్టి తలొగ్గక తప్పలేదు తప్పితే ఇన్నేళ్ల దాంపత్యంలో ఏమంత గొప్పదనం ఉందని ఈవేడుక చేసుకోవాలి!

తమని కట్టిపడేసిన తాళిబంధంతోఇన్నాళ్ళు కలిసి కాపురం చేశారే తప్ప, ఏనాడూ మనస్ఫూర్తిగా మమేకమై దాంపత్యంలోని రసానందాన్ని అనుభవించలేదు.

తనకన్నా పన్నెండేళ్ళు పెద్దవాడైన అతగాడిని చూస్తే ఏదో భయం, బితుకు, సంకోచమూ తప్పితే ‘ఇతడునావాడు’ అన్న దగ్గరతనమైతే ఏర్పడలేదు.

మేనత్తకొడుకని వయసుల తారతమ్యాలు కూడా చూడకుండా ముద్దుకృష్ణకిచ్చి కట్టబెట్టారు తనని. తనకి ముగ్గురు మేనత్తలు. అరడజనుమంది బావలు. అందరూ తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు కావడం ఉంచి వారినెత్తికెక్కి తాండవం ఆడేతంతటి చనువుండేది.

తాను భూమ్మీద పడగానే మూతికి మూడుముళ్లు వేసిన చందాన తనమొగుడిగా పెద్దలు నిర్ణయించి పారేసిన ముద్దుకృష్ణ అంటే మాత్రం చచ్చేంత భయం ఉండేది. దానికి కారణం, తుమ్మల్లో పొద్దుగూకినట్లుగా ఏమాత్రం వికాసంలేకుండా ధుమధుమలాడుతూ ఉండే అతడి వదనం, కట్టెవిరిచి పొయ్యిలో పెట్టినట్లుగా పరుషంగా ధ్వనించే అతడి మాటతీరు అతడికి ఆమడదూరంలోనే ఆపేశాయి తనని.

ఏనాడో రాసిపెట్టి ఉంది కాబట్టి తాను ఆయన అర్ధాంగి అయ్యింది. ‘చూడమ్మా భర్త కి ఎదురాడకూడదు… అతడేమన్నా, ఏంచేసినా ఊరుకోవాలి అతడికి అనుకూలంగా నడుచుకోవాలి’ కార్యంగదిలోకి పంపేముందు నాయనమ్మ చెప్పిన హితోక్తులను మనసులో పెట్టుకుని అదేవిధంగా నడుచుకుంది ఇన్నిరోజులూ.

ఒకమాటమంతి, ముద్దుముచ్చట లేకుండా అతడు తనని ఆత్రంగా అక్రమించుకుంటూ ఉంటే నోరిప్పకుండా అతడి చేతుల్లోమైనపుముద్దలా కరిగిపోయింది అదే పరమ సతీధర్మం అనుకుంటూ.

ఇన్నేళ్ళ సంసారంలోనూ అతడికి ఎదురాడిందిలేదు, తన అభిప్రాయాన్ని వెల్లడించినదీలేదు. అతడూ అంతే … ‘ఇలా చేస్తే బాగుంటుందా!’ అని ఏనాడూ తనని అడిగిన పాపాన పోలేదు.

అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటూ వచ్చాడు వాటివలన ఏపరిణామం ఎదురైనా సరే.

ఎప్పుడైనా అతడికి తీసుకెళ్లాలి అనిపిస్తే సినిమాకి తీసుకెళ్లేవాడు. అదికూడాచెల్లెళ్ళనీ, తమ్ముళ్లనీ వెంటేసుకుని మరీనూ. కదలక మెదలక పడుండే లగేజీ మూటల్లా ఎవరిసీట్లో వాళ్ళు కూర్చుని కళ్లప్పగించి సినిమా చూడడం వరకే.తామిద్దరమే సినిమాలకి వెళ్లాలని, హాల్లోకి వచ్చే ఇతర జంటలమాదిరి అతడు తనభుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకుని నవ్వుముఖంతో సినిమాలోని సన్నివేశాలని ఎంజాయ్ చేయాలని, సినిమాలో వచ్చే సరస సన్నివేశాలప్పుడు తమకంగా తన నడుముమీద మీటాలని అనిపించేది రాధకి. అంతేకాదు… అందులోని నాయికా నాయకుల్లా తామిద్ద్దరూ కూడా నిరంతరమూ ఒకరినొకరు అల్లుకుని ఆనందానుభూతులు చవిచూడాలని బలంగా వాంఛించేది రాధ.

కాని, ముద్దుకృష్ణ అందుకు పూర్తిగా వ్యతిరేకం. దాంపత్యమనేది వంశాభివృధ్ధికే అన్న పెద్దల మాటను పూర్తిగా నమ్మినవాడిలా ఉండేది అతడి ప్రవర్తన. ఫలితంగా ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టుకొచ్చారు. ఆతరువాత ఎప్పుడైనా ఋతుధర్మం ప్రకారం శరీరం స్పందిస్తే, తదనుగుణంగా ఆ కోరికను చల్లార్చుకోవడం మినహా వేరే సమయాల్లో భార్యకి సన్నిహితంగా వచ్చేవాడు కాదతడు.

తనకన్నా వయసులో పెద్దవాడైన కారణంగా ఏర్పడిన భయం ఓపక్క, నవ్వితే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్న రీతిలో ముఖంముడుచుకు ప్రవర్తించే ముద్దుకృష్ణ తీరొకపక్కన..వెరసి ఈ కారణాలచేత రాధ అతడికి మానసికంగా చేరువకాలేకపోయింది.

 

“ఏంటమ్మా…ఇక్కడేం చేస్తున్నావు? బావేడీ?’’ పాండురంగం స్వరంవిని ఉలికిపడి ఈలోకంలోకి వచ్చిన రాధమ్మ “ఏమోనన్నయ్యా…అలా పొలం వెళ్లారేమో!’’ అంది తడబడుతూ.

“బాగుంది మీ ఆయన వ్యవహారం! రేపు ఇంట్లో సందడి పెట్టుకుని ఇవాళ పొలం వెళ్లకపోతే ఏంపోయింది! వట్టి పెడసరం మనిషి కాకపోతేనూ!’’ముద్దుకృష్ణ సంగతి తెలిసిన పాండురంగం ముద్దుగా విసుక్కున్నాడు.

బదులీయకుండా చిన్నగా నవ్వింది రాధమ్మ.

‘;సరిపోయింది… అతగాడికి తగిన ఇల్లాలివే నువ్వూనూ!’’ మురిపెంగా అంటూ బయటకు వెళ్లిపోయాడు పాండురంగం.

రాధమ్మ బలవంతంగా నవ్వుతూ పనుల్లో చొరబడిపోయింది. చేతులు అలవాటున్న పనులను యాంత్రికంగా చేసుకుపోతున్నాయి. మనసుమాత్రం ఇందాక వీక్షించిన మధురఘట్టాలని మననం చేసుకుంటోంది.

మొగుడుని చనువుగా ‘ఒరేయ్…రారా…పోరా’ అంటూ పిలుస్తూ అల్లుకుపోతున్న ఆముగ్గురమ్మాయిలని చూస్తే ఎంతో సరదాగా అనిపిస్తోంది. ‘తాము మగాళ్లమ’న్న అహంభావం ఏమాత్రం లేకుండా ఆపిలుపులోని సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తున్న కొడుకుల సంస్కారానికి సంబరపడింది.

ఆమధ్యన వచ్చినప్పుడు అవని భర్తని అందరిలోనూ ‘ఒరేయ్’ అని పిలిస్తే మండిపడ్డాడు ముద్దుకృష్ణ.

“ఏంటమ్మా…వచ్చిన దగ్గరనుంచీ చూస్తున్నాను…భర్తని అలా గౌరవం లేకుండా ‘ఒరేయ్…తురేయ్…’’ అంటూ సంబోధిస్తున్నావేమిటి? ఎవరన్నా వింటే పిల్లని కట్టుదిట్టాల్లో పెట్టలేదని మానోట్లో ఇంత గడ్డిపెడతారు. ‘’ అంటూ కూతురిని ఘాటుగా మందలించాడు.

బిత్తరపోయిన అవనిని వెనకేసుకుని వస్తూ “ ఫరవాలేదు మామయ్యగారూ… ఎలా పిలిస్తే ఏముంది! అయినా అలా పిలవమని అవనికి నేనే చెప్పాను…’’ అన్నాడు అరుణ్.

“మీరిద్దరే ఉన్నప్పుడు ఎలాగన్నా పిలుచుకోండి. కాని, నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం భర్తకి మర్యాద ఇచ్చి తీరాలి…’’ శాసనంలా అన్నాడు ముద్దుకృష్ణ.

తండ్రి ఆజ్ఞకి ఎదురాడనిదానిలా తలూపింది అవని. చిన్నబుచ్చుకున్న అవని ముఖం చూస్తే రాధమ్మ జాలనిపించింది. ఆమెను దగ్గరగా పొదువుకుని “చూడుతల్లీ… నాన్నగారు చెప్పినది కూడా నిజమే. మీరిద్దరే ఉన్నప్పుడు అరుణ్ ని నీకిష్టమైనట్లుగా పిలుచుకో. అందరిలోమాత్రం అలా ఏకవచనప్రయోగం చేయకు. నీకంతగా కావాలంటే ‘ బావా’ అని పిలువు. ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు.’’ అంటూ అనునయించింది.

అలాగేనని తలూపింది అవని. ఆమె తన భర్తని ‘బావా’ అంటూ సంబోధించడం విని బంధువర్గంలో చాలామంది చెవులు కొరుక్కున్నారు, కొందరు చాటుగానూ, మరికొందరు బహిరంగంగానూ విమర్శించారు…’ఏసంబంధం ఉందని అవని అలా మొగుడిని ‘బావా’ అంటోంది అని! కాని, అవని అవేమీ ఖాతరు చేయలేదు.

అప్రయత్నంగా తమ పెళ్లైన కొత్తలో సంగతి జ్ఞప్తికొచ్చింది రాధమ్మకి. ఎలాగూ వరసైనవాడే కదా అని ఓనాడు ముద్దుకృష్ణ పొలంనుంచి రాగానే చెంబుతో కాళ్ళుకడుక్కునేందుకు నీళ్ళు తీసుకెళ్తూ “ కృష్ణబావ వచ్చాడు అత్తయ్యా… భోజనానికి ఏర్పాటు చేసేయనా?’’ అంటూ చనువుగా దూసుకుపోయింది చిన్నారిరాధ.

 

అంతే ఆవిడ అలా నీళ్లచెంబుతోనే రాధని నిలబెట్టి నిలువునా కడిగేసింది. “నీకన్నా సహస్రాంతం పెద్దవాడు, పైగా నీమొగుడు…వాడినలా ఏకవచనంలో పిలవకూడదని తెలియదూ! మొగుడిని ‘ఏమండీ’ అని గౌరవించాలి. అతగాడేమన్నా ఎదురు సమాధానం చెప్పకూడదు, అతగాడు భోంచేశాకే నువ్వు భోంచేయాలి. ఎదురుపడినప్పుడు పైట నిండుగా కప్పుకోవాలి…’’ అంటూ ఇత్యాది నీతి బోధలన్నీ గావించిన అత్తగారిని ఎవరో పరాయివాడిని గౌరవించమన్నట్లుగా ఇంత దీర్ఘంగా ఉపన్యాసం దంచుతుందేమిటీవిడా! అంటూ బోలెడంత ఆశ్చర్యపోయి , ఆవిడగారు పరమపదించినా సరే…ఆవిడ చెప్పిన సూక్తులను ఈనాటికీ అమలుపరుస్తోంది రాధమ్మ.

తమ కడుపున పుట్టిన చిన్నారులు అలా నవ్వుతూ తుళ్లుతూ జీవన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఒక పక్క సంతోషం, ఒక పక్క ఆ మాధుర్యాన్ని తాను పొందలేదే అన్న వేదన రాధమ్మని కుదిపేస్తున్నాయి అంతలోనే సరిపెట్టుకుంది…’ ఈజన్మకి ఇంతే రాసిపెట్టి ఉంది… దీనికి ఎవరుమాత్రం ఏం చేయగలరు!’’ అనుకుంది నిర్లిప్తంగా.

ఇంతలో ‘’ అత్తయ్యగారూ… అంటూ ఏకకంఠంతో కోడళ్ళు పివడంతో ఆలోచనల గొలుసు పుటుక్కున తెగిపోయింది. “వస్తున్నానమ్మా ‘’ అంటూ అటువైపు నడిచింది రాధమ్మ నిట్టూరుస్తూ.

——————— —————————— ——————-

అనుకున్న విధంగానే షష్టిపూర్తి మహోత్సవంఅయినవాళ్ళ ఆనందోత్సాహాల నడుమ అత్యంత వైభవోపేతంగా సాగింది. ఇల్లంతా బంధుమిత్రులతో నిండిపోయి సంబరాలకి నెలవుగా మారింది. ఇల్లంతా పచ్చని మామిడి తోరణాలతో,ద్వారబంధాలకి అలంకరించిన రంగురంగుల బంతిపూల హారాలతో కళకళలాడిపోతూ జరుగుతున్న శుభకార్య సందోహానికి అద్దంపడుతున్నట్లుగా ఉంది.

ముదురు ఆకుపచ్చ కంచిపట్టుచీరలో రాధమ్మ ముగ్ధ మనోహరంగా మెరిసిపోతూ ఉంటే షష్టిపూర్తి పెళ్ళికొడుకైన ముద్దుకృష్ణ బరంపురం పట్టుపంచెల చాపులో హుందాగా వెలిగిపోతున్నాడు. పిల్లలు ముగ్గురూ కలిసి తల్లికి బంగారు నెక్లెస్ సెట్, తండ్రికి బ్రేస్‌లెట్ బహుకరించారు.

నవకాయపిండివంటలతో విందుభోజనాలు ముగిసిన అతిధులందరూ వీరు పెట్టిన నూతన వస్త్రాది కానుకలను అందుకొన్నాక ఒక్కొక్కరుగా నిష్క్రమించారు. ఇంట్లోని సభ్యులు తప్ప దాదాపు బయటవారెవరూ మిగలలేదక్కడ.

కాసేపు అందరూ విశ్రాంతి తీసుకున్నాక కొడుకులు, అల్లుడు కలిసి మిగతా వాళ్లని ఊరికి దగ్గరలో ఉన్న రిసార్డ్స్ కి బయలుదేరదీశారు.

“అదేమిటిరా అబ్బాయ్! పొద్దుటినుంచీ నానా హైరానా పడి ఒళ్ళు చిక్కొట్టుకున్నారు…హాయిగా ఇంట్లో రెస్టుతీసుకోక ఈ తిరుగుళ్ళేమిటి?’’ మందలింపుగా అంది రాధమ్మ.

“ఇక మేం ఉండేది మహా అయితే రెండురోజులేకదమ్మా…ఈ రిసార్డ్స్ బాగుంటుందని మాఫ్రెండ్ చెప్పాడు. మేము పోయొస్తాం. ఆ రెస్టేదో మీరే తీసుకోండి’’ నర్మగర్భంగా నవ్వాడు దీపక్.

“ అవునురా అన్నయ్యా…మళ్ళీ వీలవుతుందో లేదో…ఇప్పుడు వెళ్లడమే మంచిది…’’ అతడిని బలపరుస్తూ ఓరగా కీర్తనవైపు చూస్తూ కన్నుగీటాడు భువన్.

ఆ చర్య రాధమ్మ కంటపడనే పడింది. పిల్లలు ఈవిహారయాత్ర పేరిట బయట తిరుగుతూ తమకి ఏకాంతం కల్పిద్దామని తలపోస్తున్నారన్న సంగతి అవగతమవగానే రాధమ్మ మది ఆర్ద్రమైంది. తమ సంతోషంకోసం ఆరాటపడుతున్న ఆ పసివాళ్ళని మనసులోనే ఆశీర్వదించింది.

కాని, వారు ఆశించినదీ, ఊహించినదీ ఏదన్నా ఉందా తమ మధ్యన! ఎందుకో కళ్లు చెమ్మగిల్లాయి. ఎవరికంటా పడకుండా చప్పున తలదించుకుంది. తాముండగానే పనివాళ్ల సహాయంతో ఇల్లంతా సర్దేసి యధాస్థానానికి తెచ్చారు పిల్లలు.

వాళ్ళు వెళ్లాక చల్లని నీళ్ళతో స్నానం చేసి కోడళ్లు సాయంత్రం కట్టుకోమంటూ ఇచ్చిన పాకెట్టు తెరిచింది. అందులో తెల్లని ఉల్లిపొరలాంటి నెట్టెడ్ చీర, దానికి తగిన డిజౖనర్ బ్లౌజ్ ఉన్నాయి. పారదర్శకంగా అగుపిస్తున్న ఆచీరని చూస్తే రాధమ్మ ఒళ్ళు సిగ్గుతో ముడుచుకుపోయింది.

“ఛీ… ఈపిల్లల అల్లరికి హద్దు-పద్దు లేకుండా పోయిందమ్మా బొత్తిగా! ఇది అసలు తాను కట్టుకోవలసిన చీరేనా!’’ ఎప్పుడూ ఒళ్లంతా కప్పేలా నేతచీరలు, కాటన్ చీరలు కట్టుకునే అలవాటున్న రాధమ్మ చిరాగ్గా అనుకుంటూ ఆచీరను మంచంమీద గిరాటేయబోతూ అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి ఆగిపోయింది.

నలభై ఎనిమిదేళ్ల వయసులోనూఈ శరీరపు నిగారింపు ఏమాత్రం తగ్గలేదు. చెంపల దగ్గర అప్పుడప్పుడే నెరుస్తున్న జుట్టు తప్ప, ముఖ సౌందర్యంలో ఏమార్పూలేదు. నిండుతనాన్ని సంతరించుకున్న శరీరసౌష్టవం మరింత అందంగా కనిపిస్తోంది.

అప్పుడప్పుడు వచ్చిపోయే అవని ఫ్రెండ్స్ తనని పొగుడుతూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం గుర్తొచ్చింది “ ఆంటీ ఈవయసులో కూడా మీరెంత సెక్సీగా ఉన్నారో తెలుసా! ఆముతక నేతచీరలు కట్టుకోవడం మానేసి ఏడిజైనర్ చీరలో కట్టుకున్నారనుకోండి… సూపరుంటారు…’’ అంటూ తనని ఊదరగొట్టేవారు.

నిజమే! తనకేమంత వయసైపోయిందనీ…అమ్మమ్మ వేషాలు వేయాలి! అయినా ఇప్పుడీచీర కట్టుకోబోయేది ఈనాలుగు గోడల మధ్యనే కదా! అనుకుంటూ నెమ్మదిగా ఆచీర,జాకెట్టు ధరించి ,తలనిండా మల్లెలుతురుముకుని ముస్తాబయ్యింది రాధమ్మ.

 

అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి తానే నివ్వెరపయింది. అమాంతం తనవయసు ఓపదేళ్ళు తగ్గినట్లుగా ఫీలయ్యింది రాధమ్మ. రూపలావణ్యాలు ఏమాత్రంతగ్గని ఆమె శరీరం మీద అందంగా అమిరిపోయి ఆమె సౌందర్యానికి సరికొత్త సొగసులు అద్దింది ఆ తెల్లచీర.

అలంకరించుకుని బయటకొచ్చిన రాధమ్మ ఎదురుగా కనిపిస్తున్న భర్తను చూసి ఆగిపోయింది బిడియంగా. తననే కన్నార్పకుండా చూస్తున్న భర్తను చూస్తే ఎందుకో సిగ్గు ముంచుకొచ్చింది. మెల్లగా కళ్లెత్తి అతడివైపు చూసింది. అతడికళ్ళలో కనిపిస్తున్న ప్రశంసను చూసి ఆశ్చర్యపోయింది.

ప్రౌడ అందాలతో విరాజిల్లుతున్న అర్ధాంగి కి దీటుగా తెల్లనిలాల్చీ పైజమాలలో వయసుమళ్ళిన మన్మధుడల్లే వెలిగిపోతున్నాడు ముద్దుకృష్ణ. ‘తల కాస్త నెరిసిందికాని, నామొగుడిప్పటికీ నలకూబరుడే’ మురిపెంగా అనుకుంది రాధమ్మ.

“ఇవాళ నువ్వు చాలా బాగున్నావోయ్!’’ ఏనాడూ భర్త నోటమ్మట వినబడని ప్రశంస వినగానే అపనమ్మకంతో చూశాయి రాధమ్మకళ్ళు.

“మీ…మీరు కూడా ఈ డ్రస్‌లో చాలా…బా…గున్నారు…’’ అప్పుడే మాటలు పలకడం నేర్చుకుంటున్న పసిపాలా తడబడింది రాధమ్మ.

ఆశ్చర్యంగా చూశాడు ముద్దుకృష్ణ . “అమ్మో! మా ఆవిడకి మొగుడిని మెచ్చుకోవడం కూడా వచ్చే!’’ అన్నాడు చిలిపిగా నవ్వుతూ.

అతడికి రెట్టింపు ఆశ్చర్యపోవడం రాధమ్మ వంతైంది. “ మరి మీరు కూడా పెళ్లైన ఇన్నాళ్లకి భార్యని మెచ్చుకుంటున్నారుగా…’’ గడుసుగా అంది రాధమ్మ.

“ భార్య అందాన్ని మెచ్చుకోవాలని ఏభర్తకి ఉండదు చెప్పు! కాని, దగ్గరకొస్తేనే ముద్దబంతిలా ముడుచుకు పోతున్న ఈ అందాలభరిణని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియలేదిన్నాళ్ళూ…’’ కొంటెగా అన్నాడు ముద్దుకృష్ణ.

“బాగుంది మీవరస! ఆడది ఎప్పుడూ సంకోచంతో ముడుచుకుపోతుంది. చొరవచేసి ఆబిడియాన్ని పోగొట్టవలసింది మగవాడే…’’ తనకంత చేరువగా వచ్చిన భర్త దగ్గర భయంపోయి, చనువు ఏర్పడుతోంది రాధమ్మ మదిలో.

“చూడు నా బంగారు రాధమ్మా… పూమొగ్గ తనంత తానుగా వికసిస్తేనే అందం. బలవంతంగా వికసింపజేస్తే అందులోని అందం, ఆకర్షణ రెండూ నశిస్తాయి. అందుకే నన్ను చూడగానే సిగ్గుతో ముడుచుకుపోయే పూమొగ్గలాంటి నిన్ను వికసింపజేయాలని అనుకోలేదు. మొగుడికి ఎదురాడకూడదన్న పెద్దలమాటననుసరించి నాతో కాపురం చేశావే కాని, ఏనాడూ నీ ఇష్టాన్ని పెదవివిప్పి నాతో చెప్పలేదు….’’ ఆవయసులోనూ మొగుడి ని తనవైపు ఆకట్టుకునే అందాలతో కనిపిస్తున్నఅర్ధాంగిని చేయిపట్టి దగ్గరకు లాక్కున్నాడు ముద్దుకృష్ణ.

అలవాటైన స్పర్శే అయినా ఆరోజు మాత్రం అతడి మేను తన శరీరానికి తగలగానే ఏదో కొత్తగా అనిపించి రాధమ్మ ఒళ్లంతా ఏవో వింత పులకింతలు రేగాయి. అప్రయత్నంగా అతడిని అతుక్కుపోయింది.

“నెపంనామీద నెట్టేస్తున్నారు కాని, మీరు మాత్రం ఏనాడన్నా నాతో మనసువిప్పి మాట్లాడారా? కనీసం మనం ఏకాంతంలో ఉన్నప్పుడైనా సరే నాతో సరదాగా మాట్లాడారా? ధుమధుమలాడే మీముఖం చూస్తే నాకు పైప్రాణాలు పైనే పోయేవి. రవికిరణాలు సోకితేనే కమలం వికసిస్తుందన్న వాస్తవం మరచారా?’’ భర్త కౌగిట్లో ఒదిగిపోతూ కాస్త కినుకగా గారాలు పోయింది రాధమ్మ.

వాళ్ళిద్దరూ అప్పుడే పెళ్ళైన కొత్తజంటలా ఉన్నారు ఆక్షణాన. అన్నేళ్ళు దాంపత్యజీవితం గడిపినా కలగని వింత అనుభూతులేవో ఇరువురి మనసుల్లోనూ ఉత్పన్నమౌతూ వాళ్లని చైతన్యపరుస్తున్నాయి.

“నిజమే రాధా… ఇందులో నాతప్పూ ఉంది. ఆడదాని సిగ్గు బిడియాలను పోగొట్టవలసిన బాధ్యత మగవాడిదేనని విస్మరించాను. ఇంటినిండా జనాలు, నావెనక పెళ్లికావలసిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు…వీళ్లముందు నేను నీతో చనువుగా ఉంటే అవి వాళ్లమనసుల మీద ఏదన్నా ప్రభావం చూపిస్తుందేమోననే ఆలోచించాను కాని, నిన్ను బాధపెడుతున్నాను అని అనుకోలేదు…నన్ను క్షమించురాధా…’’ ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు ముద్దుకృష్ణ ఆర్ద్రత నిండిన స్వరంతో.

చప్పున తనచేత్తో అతడి నోరుమూసింది రాధమ్మ. అతడిని మరింతగా అల్లుకుపోయింది. పిల్లలు ముచ్చటపడి అలంకరించిన మల్లెలమంచంమీద, కోరికతో జ్వలిస్తున్న దేహాలను , తమమోహపు జల్లులతో చల్లార్చుకునే ప్రయత్నంలో పడ్డారిద్దరూ.

ఏనాడూ చవి చూడని సరికొత్త మధురిమలు చవిచూశారు. జీవితంలో మొదటిసారిగా భర్తని తనంత తానుగా రంజింపజేసింది రాధమ్మ. అలసి సొలసిఒన దేహాలతో సొమ్మసిల్లిన ఆ జంట మనసులో ఆనాటి ఆదివ్యానుభూతి సజీవమై నిలచింది.

“ థాంక్స్ రాధా…ఏనాడూ ఎరగని మధురానుభవాన్ని పంచిచ్చావు. ఈ మంచిసమయాన నీకేదన్నా కానుక ఇవ్వాలనిపిస్తోంది .ఏంకావాలో అడుగు…’’ తృప్తిగా భార్య నుదురు ముద్దాడాడు ముద్దుకృష్ణ.

“నాకింకేం కావాలండీ…. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలనిచ్చారు. సంఘంలో మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఈనాడు మీమనసు తెలిసి మసలుకునే అవకాశం ఇచ్చారు…ఇంతకన్నా నాకింకేం కావాలి…’’ అతడి ఒడిలో తలపెట్టుకు పడుకున్న రాధమ్మ మోము వింత సంతృప్తితో మెరిసింది.

 

“అలా కాదు రాధా…ఏనాడూ నాకిది కావాలని అడగలేదు…నీకేంకావాలో తెలుసుకోవాలని నేనూ ప్రయత్నించలేదు. మొహమాటపడకుండా అడుగు…’’ ప్రేమగా అన్నాడు ముద్దుకృష్ణ.

తనంత తానుగా వరమిచ్చిన భర్తని చూసి రాధమ్మ మనసులో ఏదో సంకోచం మెదిలింది లీలామాత్రంగా. మెదడులో ఏదో తళుక్కుమంది. అక్షణంలో అతడి సమక్షంలో ఏర్పడిన ఆచనువు ఆసంకోచాన్ని అధిగమించింది.

“సరే అడుగుతాను…మీరు ఏమీ అనుకోకూడదు…’’ ముందరికాళ్లకి బంధం వేసింది రాధమ్మ.

“ఏమీ అనుకోను సరేనా! అడుగుమరి!’’ అభయమిచ్చాడు ముద్దుకృష్ణ.

అతడి చూపుల్లో ఇరుక్కున్న తన దృక్కులను మరల్చుకుంటూ ‘’ మరి! మరీ…నాకు మిమ్మల్ని…’ఒరేయ్ బావా’ అని పిలవాలని ఉంది.’’ తన మనసులో మాట చెప్పేసింది రాధమ్మ.

ముద్దుకృష్ణ ముఖంలో ఒక సంభ్రమరేఖ కొద్ది సెకన్లపాటు కదిలి మాయమైంది. ముఖమంతా చిరునవ్వు పరచుకుంది. అతడు ఏమనుకుంటాడో అని సందేహపడుతూ హడలిపోతున్న రాధమ్మకి ఆదరహాసం ధైర్యాన్ని ప్రసాదించింది.

“అలాగే పిలువు… ఎవరు కాదన్నారు? ఎలాగూ నేను నీ బావనే కదా!’’ చిలిపిగా అన్నాడు ముద్దుకృష్ణ.

విస్మయంగా చూసింది రాధమ్మ అతడివైపు. “మరి మీకు… అలా ఏకవచన ప్రయోగం చేస్తే నచ్చదు కదా!’’ అడిగింది విస్తుపోతూ.

“నచ్చదని నీతో చెప్పానా?’’ అల్లరిగా అడిగాడు ముద్దుకృష్ణ.

“మరి! మన అవని ఆరోజు అరుణ్ ని ఏకవచనంలో పిలుస్తూ ఉంటే కూడదని మందలించారు కదా!’’ రాధమ్మలో వీడని ఆశ్చర్యం.

ముద్దుకృష్ణ ఫకాలున నవ్వుతూ “అదా! ఈకాలం పిల్లలకి మొగుడి దగ్గర మితిమీరిన స్వతంత్రం, చనువు ఉంటున్నాయి. ఒక్కోసారి అవి అపార్ధాలకి, పొరపొఛ్ఛాలకి దారి తీస్తున్నాయి. ఇద్దరం సంపాదిస్తున్నాం కాబట్టి ఒకరిమాట ఇంకొకరు వినేదేమిటి అన్న విపరీత ధోరణులు ప్రబలిపోయి వాళ్ల సంసారాలని ముక్కలు చేసే పరిస్థితులకి దారి తీస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ల ప్రవర్తనలో లోపాలని చక్కదిద్దవలసిన బాధ్యత పెద్దలదే కదా! అందుకే అవనిని అలా మందలించాను. ఏకాంతంలో వాళ్ళు ఎలా ఉన్నా ఫరవాలేదు. నలుగురిలో మాత్రం భర్తని గౌరవించాలన్న సంగతి తనకి తెలియాలనే అలా అన్నాను. అంతేకాని, వారి ఇష్టాలని తప్పుపట్టేందుకు కాదు.’’ సున్నితంగా చెప్పాడు ముద్దుకృష్ణ.

సంభ్రమంగా చూస్తూ ఉండిపోయింది రాధమ్మ మొగుడివైపు. అతడిలో తానిన్నాళ్ళూ ఎరుగని కొత్తకోణాలేవో దర్శనమిచ్చాయి.

తనకేసే చూస్తూ ఉండిపోయిన అర్ధాంగి బుగ్గమీద చిటికె వేస్తూ “ఏంటిరా… అలా చూస్తున్నావు? ఎలాగో పిలవాలనుందిగా! ఆగిపోయావెందుకు పిలిచేసేయి… ఓపనైపోతుంది… అయినా నీకో సంగతి తెలుసా! శృంగార సమయాన మొగుడ్ని ‘రారా…పోరా’ అంటే మరింత కసి, కైపు పెరుగుతాయి…’’ అన్నాడు ముద్దుకృష్ణ గుసగుసగా.

రాధమ్మ కళ్ళు అరమోడ్పులవ్వగా తన బాహుయుగళిని అతడి మెడచుట్టూ పెనవేస్తూ “పోరాబావా!’’ అంది అతడి గుండెల్లో ముఖం దాచుకుంటూ.

ఆమెను అలాగే కౌగిట్లో పొదువుకున్నాడు ముద్ద్దుకృష్ణ. మనసులో కోరిక తీరిన ఆశుభతరుణం ఇద్దరి మనసుల్లో మంగళవాద్యాలు మోగించింది.

—————————————- సమాప్తం ————————————–

 

ఈ రోజు అప్డేట్ అయిన మరిన్ని కథలు 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *